Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!
బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్నంటుంది. సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. మహిళలు బంగారం జోలికి వెళ్లే పరిస్థితులు లేకుండా పోయాయి. ఒక్కరోజులోనే సోమవారం 100 22 క్యారెట్స్ బంగారంకు 22,500 రూపాయలు పెరిగింది.

Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్నంటుంది. సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. మహిళలు బంగారం జోలికి వెళ్లే పరిస్థితులు లేకుండా పోయాయి. ఒక్కరోజులోనే సోమవారం 100 22 క్యారెట్స్ బంగారంకు 22,500 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్స్ బంగారంకు 19,100 పెరిగింది. దాంతో మహిళలు బంగారం ఆశలు నిరాశలవుతున్నాయి.
100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు సోమవారం 19,100 పెరగడంతో 14,56,900 రూపాయలకు చేరింది. అదే విధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం 22,500 రూపాయలు పెరిగి 13,40,500 చేరింది. భారీగా ధర పెరిగి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డ్ స్థాయి ధరకు చేరింది.
ఈరోజు తులం ఎంతంటే :
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల తులం బంగారం ధర సోమవారం 22 క్యారెట్స్ 10 గ్రాములకు 2250 రూపాయలు పెరిగి 1,34,050 రూపాయలకు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్స్ బంగారం ధర సోమవారం 1910 రూపాయలు పెరిగి 1,45,690 రూపాయలకు చేరింది.
హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, కాకినాడ పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
-
వేపచెట్టు కొమ్మల నుంచి బుసబుస శబ్దం.. తీరా చూస్తే విచిత్ర దృశ్యం..!
-
Cyber Crime : రూ.5 వేలు ఇచ్చారు.. రూ.2.9 కోట్లు కొట్టేశారు..!
-
Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళ.. వార్డుల వారిగా రిజర్వేషన్లు ఇవీ..!
-
BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!
-
అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!









