కారు ఢీకొని మహిళ మృతి..!

కారు ఢీకొని మహిళ మృతి..!

కనగల్ , మన సాక్షి:

మండలంలోని తేలకంటిగూడెం స్టేజి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కనగల్ ఎస్సై నర్రా అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం….

మండలంలోని ఇస్లాం నగర్ పరిధి కంకర మిల్లుకు చెందిన దండుగుల అనసూర్య (55) తేల కంటి గూడెం లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా తేల కంటి గూడెం స్టేజి సమీపంలో నల్లగొండ వైపు అతివేగంతో వస్తున్న కారు నడుచుకుంటూ వెళుతున్న అనసూర్యను వెనుక నుండి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బాధితురాలికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ALSO READ : 

  1. TS TET : టెట్ ఫలితాలకు అంతా సిద్ధం.. ఫలితాలు ఎప్పుడంటే..!
  2. Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!
  3. Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!