తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ఎన్విఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా సీబీకే జట్టు..!

Miryalaguda : ఎన్విఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా సీబీకే జట్టు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఎన్విఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో సీబీకే జట్టు విజేతగా నిలిచింది. గత ఆరు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ నూకల వేనన్న మిత్ర బృందం ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఫైనల్లో సీబీకే వర్సెస్ ఎన్విఆర్ జట్ల మధ్య జరిగిన పోటీలో సీబీకే విజేతగా నిలువగా ద్వితీయ బహుమతిని ఎన్విఆర్ జట్టు గెలుచుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ యూసుఫ్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం, దేహదారుర్యం యువత తప్పుదారి పడకుండా సన్మార్గంలో నడవడానికి యువత ఈ సమాజం కొరకు ఆలోచింప చేసే విధంగా ఉంటాయన్నారు.

ఇటువంటి కార్యక్రమాలు చేయుటకు ఆర్గనైజర్స్ కి తోడుగా క్రీడాకారులను ఉత్సాహపరచటానికి దాతలు ఎంతో అవసరం ఈ టోర్నమెంట్ కు సహకరించిన దాతలను అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గుమ్మిత వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు గుమ్మిత నవీన్ రెడ్డి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీసు, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ , బెస్ట్ ఫీల్డర్, లకు వారి సొంత ఖర్చుతో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వీరికి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలను, క్రికెట్ బ్యాట్ మరియు బూట్లను ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో ఎన్విఆర్ ఫౌండేషన్ అధినేత నూకల వేణుగోపాల్ రెడ్డి,డిసిసి జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలకృష్ణ , కౌన్సిలర్లు రవి నాయక్, ముదిరెడ్డి నర్సిరెడ్డి , గౌట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ దిరావత్ ధర్మానాయక్, ఇన్చార్జీలు ధీరవత్ రమేష్ నాయక్ , ఆంగోత్ చక్రి నాయక్ , కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ పాతూరి శరత్ మరియు ఎన్విఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆడోత్ అశోక్ నాయక్ ,

గడగోజు ఆశోకచారి , గుడిపాటి కృష్ణ , మహేశ్వరపు అనిల్ కుమార్ , ధనావత్ నాగు నాయక్ , దాసరి భీమేష్ , కొమ్ముకోటి , ఎస్.కె మస్తాన్ , సింగం శ్రీధర్ , నాయిని లక్ష్మణ్ , ప్రశాంత్ , మహేష్ , గని , నాని , రవి , నవీన్ , రమేష్ , రేవంత్ , మనోజ్ , శేరియాజ్ , మనీ పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!

  2. District collector : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి.. కలెక్టర్ ఆదేశం..!

  3. Nalgonda : చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయె.. ఎమ్మెల్యే వీరేశం, జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు..!

  4. Free Current : దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఈ పథకానికి అప్లై చేసుకోండిలా..!

  5. Ration Cards : కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సర్వే..!

మరిన్ని వార్తలు