తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Nelakondapalli : సివిల్ సప్లై గోదాములలో బియ్యం నిల్వలు పరిశీలించిన చైర్మన్..!

Nelakondapalli : సివిల్ సప్లై గోదాములలో బియ్యం నిల్వలు పరిశీలించిన చైర్మన్..!

నేలకొండపల్లి,  మన సాక్షి :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్న సివిల్ సప్లై బియ్యం ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పరిశీలించారు. సోమవారం మార్కెట్ గోడౌన్ లో నిల్వ చేసిన బియ్యం ను పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గోడౌన్ కెపాసిటి ఎంత… సివిల్ సప్లై నుంచి ఎంత వస్తుంది… నిల్వ కు తగిన ఏర్పాట్లు గురించి తెలుసుకున్నారు. అనంతరం కార్యకర్తలతో పాటు మండల కేంద్రంలో టీ సేవించి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వివిధ గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు