Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!
Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ లో ఉన్న సమస్యలకు చెక్ పెట్టనున్నది. రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందడంతో పాటు అధికారులకు దరఖాస్తులు అందజేస్తున్న విషయం తెలిసిందే. అన్నింటికీ చెక్ పెట్టేందుకు రైతు భరోసా, పంట రుణమాఫీ యాప్ ను రూపొందించింది.
తెలంగాణ ప్రభుత్వం మూడు విడతల్లో రైతుల ఖాతాలలో రుణమాఫీ నగదును జమ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేశారు.
కొందరు రైతులకు రుణమాఫీ సాంకేతిక కారణాల వల్ల కాలేదు. దాంతో వారికి రుణమాఫీ వర్తించలేదు. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డులో తప్పులుగా ఉండడం, పట్టాదారు పాస్ పుస్తకం లో పేర్లు సరిగా లేకపోవడంతో పాటు ఇతర కారణాలవల్ల అందరికీ రుణమాఫీ అందలేదు.
అంతేకాకుండా రెండు లక్షల రూపాయలకు పైగా రుణాలు ఉన్న రైతులు పై మొత్తాన్ని చెల్లించని కారణంగా కూడా రుణమాఫీ వర్తించలేదు. దాంతో ఇలాంటి సమస్యలన్నీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రైతు భరోసా, పంట రుణమాఫీ యాప్ ను రూపొందించింది.
ఈ యాప్ ను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల స్థాయి వ్యవసాయ, విస్తరణాధికారులకు కూడా ఆన్ లైన్ లో పంపించింది. వారు రుణమాఫీ వర్తించని రైతుల వివరాలను తెలుసుకొని యాప్ లో నమోదు చేయాలని మార్గదర్శకాలను జారీ చేసింది.
కాగా ఈనెల (ఆగస్టు) 27వ తేదీ నుంచి సర్వే నిర్వహించి యాప్ లో వివరాలను అధికారులు నమోదు చేయనున్నారు. అంతే కాకుండా రుణమాఫీ కానీ అర్హులైన రైతుల వివరాలను నమోదు చేసుకొని వారి ఇంటికే అధికారులు నేరుగా వెళ్ళనున్నారు. వారి బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులను పరిశీలించి, కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకొని యాప్ లో నమోదు చేస్తారు.
పంట రుణాలు కూడా భార్యాభర్తలకే కాకుండా ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు నిండిన వారి వివరాలను కూడా సేకరించి యాప్ లో నమోదు చేయనున్నారు. ఇంటికి సర్వే అధికారులు వచ్చిన సమయంలో అధికారులకు తెలియజేసిన వివరాలు తాము ఇష్టపూర్వకంగా ఇస్తున్నట్లుగా సంతకం చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత రైతు ఇచ్చిన దానికి ఆ గ్రామ కార్యదర్శి కూడా ఆటెస్ట్ చేయాలని వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే అర్హులైన రైతులకు వారి వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ కానున్నాయి.
రెండు లక్షల రూపాయలకు పైగా రుణం ఉన్నవారు అదనంగా ఉన్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా ఉన్న మొత్తం చెల్లించిన తర్వాత ఎన్ని రోజులకు రుణమాఫీ డబ్బులు పడతాయి అనే విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించ లేదు. బ్యాంకులో రుణమాఫీ డబ్బులు మాత్రం జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
LATEST UPDATE :
తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!
HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!
BIG BREAKING : తెల్ల రేషన్ కార్డుదారులకు ఇక సన్న బియ్యం.. మంత్రి ఉత్తమ్ వెల్లడి..!
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!










