విద్యానగర్ : చెస్ ఆటలో శిక్షణ

గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో చెస్ ఆటలో శిక్షణ
సూర్యాపేట , మనసాక్షి
సూర్యాపేట పట్టణంలో ని
విద్యానగర్ నందు గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద వార్డు కౌన్సిలర్ , బిఆర్ ఎస్ పార్టి జిల్లా నాయకులు గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో మేనెల 4 వ తేది నుండి ప్రతిరోజూ ఉదయం విద్యార్దులకు వేసవికాలంలో చెస్ నందు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా సోమవారం నాడు చెస్ శిక్షణలో పాల్గొన్న విద్యార్దులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ మాట్లాడుతూ వేసవికాలంలో విద్యార్దులు సెల్ ఫోన్ లతో తమ సమయం వ్ర్రధా చేసుకోకుండా వుండాలనే ఉద్దేశంతో చెస్ లో శిక్షణ అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ దాదాపుగా 100 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని అన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరచిన వారిని జిల్లా స్ధాయి మరియు రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపిక చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్ , తల్లిదండ్రులు పాల్గొన్నారు..
ALSO READ : Whatsapp Gas Booking : వాట్సప్ ద్వారా గ్యాస్ బుకింగ్ ఈజీ.. ఎలానో తెలుసుకుందాం ..!