Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ లో ముగిసిన చిరుమర్తి విచారణ.. రెండు నెంబర్లు ఇచ్చాను..!
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ లో ముగిసిన చిరుమర్తి విచారణ.. రెండు నెంబర్లు ఇచ్చాను..!
హైదరాబాద్, మన సాక్షి :
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ గురువారం ముగిసింది. ఆయనకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ నెల 9వ తేదీన నోటీసులు జారీ చేశారు. కాగా ఆయన 14వ తేదీన హాజరవుతానని ముందే చెప్పి గురువారం హాజరయ్యారు.
విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో తిరుపతన్న తనకు ఫోన్ చేశాడని, ప్రచారం గురించి అడిగి తెలుసుకున్నాడని చెప్పారు. ఆ సందర్భంలో ఇద్దరి ఫోన్ నెంబర్లు కావాలని అడగగా సమీపంలో ఉన్న తన పార్టీ కార్యకర్తలను అడిగి ఆ నెంబర్లు పంపినట్లు చెప్పారు.
పోలీసులు ఆ నెంబర్లు ఎందుకు అడిగారో..? నాకు తెలియదని ఫోన్ ట్యాపింగ్ చేయమని నేను చెప్పలేదని, ఆ రెండు నెంబర్ల వారు కూడా తనకు మిత్రులని రాజకీయాలతో వారికి సంబంధం లేదని చెప్పారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి ట్యాపింగ్ కు
పాల్పడుతున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. విచారణకు మళ్లీ ఎప్పుడు పిలిచినా తాను వస్తానని చట్టాన్ని గౌరవించే వ్యక్తిని పేర్కొన్నారు.
MOST READ :
-
BIG BREAKING : పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు..!
-
Family Survey : విద్యార్థులచే సమగ్ర సర్వే.. నిలదీసిన ఇంటి యజమాని.. (వీడియో వైరల్)
-
Komatireddy Venkatreddy : జిల్లా కలెక్టర్ పై దాడికి పాల్పడిన వారు కేటీఆర్ తో కూడా టచ్ లోనే..!
-
Gold Price : గోల్డ్ రేట్ మరింత పతనం.. కొనుగోలుకు ఇదే ఛాన్స్..!









