Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Ration Shops : రేషన్ దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు ముమ్మర దాడులు..!

Ration Shops : రేషన్ దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు ముమ్మర దాడులు..!

చింతపల్లి, మనసాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేద ప్రజల కోసం అందిస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న విషయాన్ని గమనించిన సివిల్ సప్లై అధికారులు శనివారం చింతపల్లి మండలంలోని పలు గ్రామాలలో జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవరకొండ డిటిఎస్ శ్రీనివాస్, పెద్దవూర మండల డి టి ఎస్ ముక్తార్, ఆర్ ఐ సి ఎస్, సైదులు ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు వరకాల,గడియ గౌరారం, నసర్లపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ రికార్డులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రంగారెడ్డి జిల్లా నుండి తరులుతున్న రేషన్ బియ్యాన్ని చింతపల్లి మండల పరిధిలో పోలీసులు పట్టుకోవడం జరిగిందని గ్రామీణ ప్రాంత నిరుపేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడడంతో జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్, నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు.

లైసెన్స్ పొందిన డీలర్లు ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని అర్హులైన నిరుపేదలకు అందించకుండా పక్కదారి పట్టించినట్లయితే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు పీడీ యాక్ట్ కేసు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు.

రేషన్ దుకాణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమయపాలన పాటించి దుకాణాలు తెరవాలి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ అందించే బాధ్యత డీలలదే అన్నారు.

ALSO READ : 

నాగార్జునసాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలతో చెరువులకు నీళ్లు..!

ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!

Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

 

మరిన్ని వార్తలు