గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ క్రీడలు

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ క్రీడలు

దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్.

చింతపల్లి, మన సాక్షి :

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలను అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లో నిర్వహించడం జరుగుతుందని దేవరకొండ ఎమ్మెల్యే రామవత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సీఎం కప్ క్రీడలు వాలీబాల్, కబడ్డీ, కోకో, క్రీడలను వారు ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం కప్ క్రీడల నిర్వహణ కోసం 3.60 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది అన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండు శాతం ఉన్నత విద్యాభ్యాసం కోసం 0.5 శాతం రిజర్వేషన్లు అములు కోసం క్రీడాకాలకు ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుందన్నారు.

 

క్రీడాభివృద్ధికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూతనంగా 76 క్రీడ మైదానాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. మండల స్థాయిలో విజేతలైన క్రీడాకారులకు ఈనెల 22న జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించబడతాయన్నారు. అదేవిధంగా అదేవిధంగా 29న జరిగే ప్రారంభోత్సవం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ ప్రతిష్టాత్మకగా నిర్వహిస్తున్న సీఎం కప్ విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాదాపు 19 వేల గ్రామాలు పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇప్పటికే 15 వేల పైచిలుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను పూరి చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కాపరుచుకోవాలి అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి ఎంపీడీవో రాజు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి, వి, సాగర్ రావు మండల బీసీ సెల్ అధ్యక్షులు అండేకర్ అశోక్ ఆర్ కొండల్ నాయక్ కురుమేడ్ ఎంపిటిసి కుంభం శ్వేతా శ్రీశైలం గౌడ్. నాదిరి శ్రీశైలం. మైనార్టీ సెల్ నాయకులు ఎస్.కె చాంద్పాషాషా ఎండి కాలేదు ఆర్ మాన్త్య నాయక్, ఆర్ రవి గోవింద్ శాంతయ్య ఎంపీఓ వెంకన్న, ఎంపీడీవో రాజు, క్రీడాకారులు, పీఈటీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.