ప్రజా సమస్యలు తెలుసుకునే స్థితిలో లేని కేసీఆర్ – భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

ప్రజా సమస్యలు తెలుసుకునే స్థితిలో లేని కేసీఆర్

– భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

పినపాక. మన సాక్షి

పినపాక మండలంలో మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం గారి ఆధ్వర్యంలో ఎం ఆర్ ఓఆఫీస్ ఎదుట ఐకేపీ వీవోఏలు వారి సమస్యలను పరిష్కరించాలని 29వ రోజు వారు చేపడుతున్న నిరసన సమ్మెకు సంఘీభావం తెలిపి వారికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంలో తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీవోఏలను సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం నెలకు రూ.26వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
ఐకెపి వివో ఏలకు ఉద్యోగ భద్రత కల్పించి,రూ. 10 లక్షల సాధారణ భీమా,ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలన్నారు.

అదేకాకుండా సెర్చ్ నుండి ఐడి కార్డులు కేటాయించి,గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాలు విహాల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలనీ డిమాండ్ చేశారు…
అదేవిధంగా ప్రజల సమస్యలను తెలియజేయడానికి ప్రగతీ భవన్ వద్దకు వెళితే ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉండకుండా ఫాంహౌస్ లో పండుకుంటున్నారన్నారు.

అలాగే ఐకేపీ వివో ఏ లకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ తరుపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు..
2024 లో తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమంలో టీపీసీసి సభ్యులు నల్లపు దుర్గ ప్రసాద్ ,జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న , జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహిమూద్ ఖాన్ , పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ మోత్కూరి ధర్మారావు ,పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు ,పినపాక నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు, మహిళలు, అనుబంధ సంఘాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..