తెలంగాణBreaking Newsజయశంకర్ భూపాలపల్లి జిల్లాజిల్లా వార్తలురాజకీయం
CM Revanth Reddy : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య..!
తెలంగాణలో గత కొంతకాలంగా జిల్లాలను తొలగిస్తారని, కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని జిల్లాలు చిన్నగా ఉన్నాయని, మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారానికి, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల తొలగింపు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth Reddy : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణలో గత కొంతకాలంగా జిల్లాలను తొలగిస్తారని, కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని జిల్లాలు చిన్నగా ఉన్నాయని, మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారానికి, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల తొలగింపు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేసేది లేదని, పాత జిల్లాలను తొలగించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ప్రతిపక్షాలు, అందరి ఆమోదం అయిన తర్వాతనే నిర్ణయం తీసుకోనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా పోతుందనే ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు.









