Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

సూర్యాపేట, మనసాక్షి :

తుఫాన్ కారణంగా నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా ప్రకటించారు. తక్షణ సహాయంగా ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తామన్నారు.

సూర్యాపేట జిల్లా లో తుపాన్ వర్షం మూలంగా జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలను సంబంధిత అధికారులను అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్న న్నారు. సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశం మోతే మండలం లోని ఒక ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేశారు.

ఇట్టి సమావేశం లో జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, ఎస్పీ సన్ ప్రిత్ సింగ్, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మందుల సామెల్ తో పాటు పలువురు జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టం పైన ముఖ్యమంత్రి అరా తిశారు. రాష్ట్రం మొత్తం లో సూర్యాపేట జిల్లా లో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడిందన్నారు. జిల్లా లోని అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారని పంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలిపారు.

ప్రభుత్వం మంత్రులు,ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామని, ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. ఖమ్మం, నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా,రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరామని చెప్పారు.

వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. పశువులు చనిపోతే 50 వేల సాయం.,పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల సాయం అందజేస్తామన్నారు.
ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని
సూర్యాపేట కలెక్టర్ కు తక్షణ సాయంగా ఐదు కోట్లు విడుదల చేస్తమన్నారు.

పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్ల కు నిర్ణయాధికారం ఇచ్చా మని చెప్పారు.
వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలిపారు.

వరద సమయం లో బురద రాజకీయాలు చేయొద్దు

అకాల వర్షాల మూలంగా నష్ట పోయిన వారిని ఆదుకునే పనిలో ఉండకుండా కొందరు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా లో ఉండి ఒకాయన ట్విట్టర్ లో పెడుతున్నాడు.

ఒకాయన ఫాంహౌస్ లో పండుకొని విమర్శిస్తున్నారు. వరదల సమయంలో బురద రాజకీయాలు వద్దు అని హితువు పలికారు. చెల్లి బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారు కానీ వరద బాధితులను పరామర్శించరన్నారు. మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్ననని చెప్పారు. వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ డి ఆర్ ఎఫ్ ను తయారు చేసి ప్రారంభించుకుంటున్న మన్నారు.

జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీ ని ఆహ్వానించామని  రాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయన్నారు.
తక్షణమే కేంద్రం రెండు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నకు చెందిన
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలని కోరారు..

వరదలను వాడుకొని రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదన్నారు.ఇట్టి సమావేశం లో ప్రభుత్వ సలహాదారుడు వేము నరేందర్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Nirmal : కడెం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల..!

Uthamkumar Reddy : వరద ప్రాంతాల్లో సర్వే చేయించి ఆదుకుంటాం.. మంత్రి ఉత్తమ్ పర్యటన..!

Srisailam : శ్రీశైలంకు వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, సాగర్ కు 4 లక్షల క్యూసెక్కులు.. Latest Update

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

 

మరిన్ని వార్తలు