Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Uthamkumar Reddy : వరద ప్రాంతాల్లో సర్వే చేయించి ఆదుకుంటాం.. మంత్రి ఉత్తమ్ పర్యటన..!

Uthamkumar Reddy : వరద ప్రాంతాల్లో సర్వే చేయించి ఆదుకుంటాం.. మంత్రి ఉత్తమ్ పర్యటన..!

సూర్యాపేట, మనసాక్షి :

గత రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసినాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

సోమవారం నడిగూడెం మండలం కాగితరామచంద్ర పురం వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ కి గండి పడిన ప్రాంతాన్ని మంత్రి, కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, యస్పి సన్ ప్రీత్ సింగ్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి, పాలేరు నుండి బ్యాక్ వాటర్ ఎక్కువగా రావటం తో ఎడమ కాలువ కి గండి పడిందని, 300 ఎకరాల వరకు మునిగిపోయిందని, నీరు ఊరు లోకి పోకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని, వారం రోజుల్లో కాలువకి గండి పూడ్చివేస్తామని మంత్రి అన్నారు.

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ప్రజలకు తీరని నష్టం జరిగిందని, ముఖ్యమంత్రితో మాట్లాడి నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆడుకుంటామని, రెండు రోజులలో వరద కి గురైన ప్రాంతాలలో సర్వే నిర్వహించి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ ఎస్ ఈ రమేష్ , ఆర్ డి ఓ సూర్యనారాయణ,తహసీల్దార్ సరిత, ఎంపిడిఓ విజయలక్ష్మి , ఉద్యోగులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!

Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!

మరిన్ని వార్తలు