Miryalaguda : మిర్యాలగూడలో కోడి పందాలు.. ఇద్దరు అరెస్ట్, ఏడుగురు పరార్..!
Miryalaguda : మిర్యాలగూడలో కోడి పందాలు.. ఇద్దరు అరెస్ట్, ఏడుగురు పరార్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కోడి పందాల నిర్వహించగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుపడగా, ఏడుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం..
సోమవారం రెండున్నర గంటలపుడు మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ నగర్ తండా సమీపంలో కొంతమంది వ్యక్తులు కలిసి పబ్లిక్ రోడ్డుపై డబ్బులు పెట్టి కోడిపందాలు ఆడుతున్నారని సమాచారం వచ్చింది. ఈ మేరకు మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ వారు రైడ్ చేయగా మొత్తం 09 మంది వ్యక్తులలో (02) వ్యక్తులు పట్టుబడగా, మిగిలిన (07)మంది పరిపోయినారు.
పట్టుబడిన వారిలో.. దాశరాజు వెంకటేశ్, గోగుల ప్రశాంత్ ఉన్నారు. పారిపోయిన వారిలో..
కండేలా లక్ష్మణ్, నరేందర్, కోటయ్య, బాలు , ఆంజనేయులు, మారయ్య, భూపతి శ్రీను ఉన్నారు.
వీరందరూ కలిసి కోడిపందెంలో కోడి పుంజుల కు చిన్న కత్తులు కట్టి, కొన్ని డబ్బులు పెట్టి పందేలు ఆడుతున్నారు. వారి వద్ద నుండి రెండు కోడి పుంజులు, రెండు సెల్ ఫోన్లు, మూడు బైక్స్, 2150 నగదు స్వాధీనపర్చుకోవడమైనదని తెలిపారు.
LATEST UPDATE :
-
Ponguleti SrinivasReddy : రైతులకు గుడ్ న్యూస్.. వారందరికీ సహాయం, మంత్రి పొంగులేటి వెల్లడి..!
-
Suryapet : కొడుకు ప్రభుత్వ ఉద్యోగి… కానీ అన్నం పెట్టడంలేదు, జిల్లా కలెక్టర్ ముందు ఓ తల్లి ఆవేదన..!
-
Double Bed Room Houses : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఆందోళన.. అరెస్టు చేసిన పోలీసులు..!
-
BREAKING : కోడి పందెం రాయుళ్ల అరెస్ట్..!









