యాదాద్రి భువనగిరి : కమర్షియల్ టాక్స్ అధికారుల పేరుతో వసూళ్లు

ముఠాను అరెస్టు చేసిన యాదాద్రి పోలీసులు

యాదాద్రి భువనగిరి : కమర్షియల్ టాక్స్ అధికారుల పేరుతో వసూళ్లు

ముఠాను అరెస్టు చేసిన యాదాద్రి పోలీసులు

చౌటుప్పల్. మనసాక్షి :

భువనగిరి డీసీపీ కార్యాలయంలో డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ సీఐ మల్లికార్జున్ రెడ్డి తో కలిసి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలను అడ్డగించి, చౌటుప్పల్ కమర్షియల్ టాక్స్ అధికారుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారన్నారు.

 

డిసిపి రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, చోగల్లు మండలం, కాల్వపల్లి గ్రామానికి చెందిన ముళ్ళపూడి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు టోల్ గేట్ వద్దకు వెళ్ళారు.

 

నిందితులు బొలెరో వాహనాన్ని అడ్డగిస్తుండగా పక్కా ప్రణాళికతో పోలీసులు పట్టుకున్నారన్నారన్నారు. నిందితులు పంతంగి గ్రామానికి చెందిన నక్క లింగస్వామి, శ్యామల శ్యాంప్రసాద్ గా గుర్తించారన్నారు. నిందితుల నుండి రూ.10వేలు, రెండు సెల్ ఫోన్లు, ఏపీ 29 బికే 0008 నంబరు గల సిబిజెడ్ మోటార్ సైకిల్, ఫేక్ ప్రెస్ ఐడి కార్డ్ ను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామన్నారు.

 

చౌటుప్పల్ పోలీసులను యాదాద్రి భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర అభినందించారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ సిఐ మల్లికార్జున్ రెడ్డి, ఎస్ఐ అనిల్ ఉన్నారు.