Congress First List : కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..!
Congress First List : కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..!
మన సాక్షి :
లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. జాతీయస్థాయిలో 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కర్ణాటక ,కేరళ, హర్యానా, త్రిపుర ,సిక్కిం, మేఘాలయ, మణిపూర్, రాష్ట్రాలతో పాటు తెలంగాణలో పలువురు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.
తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలు ఉండగా నాలుగు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులను ప్రకటించిన వారిలో…
నల్గొండ – కుందూరు రఘువీర్ రెడ్డి
మహబూబాబాద్ – బలరాం నాయక్
జహీరాబాద్ – సురేష్ షడ్కర్
చేవెళ్ల – సునీత మహేందర్ రెడ్డి
పేర్లు ఖరారు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని వంశీచందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ అధికారికంగా ఆయన పేరు ప్రకటించలేదు.
ALSO READ :
MallaReddy : కెసిఆర్ నుంచి మల్లారెడ్డికి కబురు.. భేటీ అయిన మల్లారెడ్డి..!









