కాంగ్రెస్ పార్టీలో విలీనంపై వైయస్ షర్మిల సంచలన ప్రకటన..!

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల సమావేశం కూడా నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీలో విలీనంపై వైయస్ షర్మిల సంచలన ప్రకటన..!

హైదరాబాద్, మన సాక్షి:

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల సమావేశం కూడా నిర్వహించారు.

కాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రస్తుత తరుణంలో ఎలాంటి చర్చలు కొనసాగడం లేదు ఈ విషయంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సోమవారం లోటస్ పాండ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు .సమావేశంలో మాట్లాడిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ విలీనంపై సంచలన ప్రకటన చేశారు.

ALSO READ : Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!

అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం లో ఆమె మాట్లాడుతూ పార్టీ విలీనం,ఎన్నికల వ్యూహం పై ప్రధాన చర్చ నిర్వహించారు. ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతగా భరిలోకి దిగుతామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 119 నియోజక వర్గాల్లో YSRTP పోటి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.

అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

ALSO READ : Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!