TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : క్యాన్సర్ తో పోరాడుతున్న 12 ఏళ్ల బాలిక.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..!
రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో మాయదారి వింత రోగం కష్టాలను తెచ్చిపెట్టింది.

Miryalaguda : క్యాన్సర్ తో పోరాడుతున్న 12 ఏళ్ల బాలిక.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..!
– 5 నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి
– దాతలు ఆదుకోవాలంటూ వేడుకోలు
నల్లగొండ, మన సాక్షి:
రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో మాయదారి వింత రోగం కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన ఇంద్రపల్లి సైదులు కుమార్తె ఇంద్రపల్లి సాహితి (12) గత ఐదు నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతూ… హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సోమత లేక కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.. కూలి పనికి వెళ్తే కుటుంబ పోషణ గడవని పరిస్థితిలో… క్యాన్సర్ వ్యాధి ఆ కుటుంబాన్ని కంటతడి పెట్టించింది. తన కూతురు ప్రాణాల కోసం దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం..చేసి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. సహాయం చేయాలనుకున్న దాతలు గూగుల్ పే/ఫోన్ పే, లేదా 7095619363 ఈ నెంబర్ కు స్పందించాలన్నారు.
By : Vinay goud, Vemulapally










