పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో బిగ్ ట్విస్ట్..!
ముంబైలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందినవారు పుచ్చకాయ తిని అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టులో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది.

పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో బిగ్ ట్విస్ట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ముంబైలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందినవారు పుచ్చకాయ తిని అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టులో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది.
2026ఏప్రిల్ 25వ తేదీ రాత్రి అబ్దుల్లా డొక్కాడియా కుటుంబం బంధువులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఆ తరువాత అర్ధరాత్రి సమయంలో పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ కుటుంబం మృతి చెందింది. తొలుత ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ అని అందరు భావించినప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్టులో కీలక నిజాలు వెలబడ్డాయి.
మృతుల మెదడు, గుండె, పేగులు వంటి కీలక అవయవాలు అన్ని ఆకుపచ్చ రంగులోకి మారినాయాన్ని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటి మార్పులు సంభవించడం ఇది శక్తివంతమైన రసాయనం, లేదంటే విషపూరిత పదార్థం శరీరంలోకి ప్రవేశించిందని డాక్టర్స్ అన్నారు.
పుచ్చకాయలో కల్తీ లేదు:
ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే పుచ్చకాయలో ఎలాంటి విషం లేదని స్పష్టం చేశాయి. పుచ్చకాయకు ఇంజక్షన్లు ఇచ్చారని, అందులో విషపూరిత రసాయనాలు ఉన్నాయని, జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. అయితే అబ్దుల్లా శరీరంలో మార్ఫిన్ అనే ఓపియాయిడ్ ….
ఆనవాళ్లు కనిపించడం దాని అర్థం మరిన్ని ప్రశ్నలకు లేవనెత్తుతుంది. విందులో పాల్గొన్న వారంతా బంధువులు.. తిన్న వారికి ఏమీ కాలేదు. కేవలం ఈ నలుగురికి మాత్రమే ఇలా జరగటం వారు మరణించడం.. ప్రమాదవశాత్తు జరిగిన పాయిజనింగ్ కాదని ఉద్దేశ పూర్వకంగా జరిగింది అని అనుమానాలు బలపడుతున్నాయి.
సోషల్ మీడియాలో బిర్యాని మరియు పుచ్చకాయ కాంబినేషన్ ప్రమాదకరమని వస్తున్న వార్తలను కూడా వైద్యులు కొట్టి పడేశారు. ప్రస్తుతం ముంబై పోలీసులు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చే తుది కెమికల్ అనాలసిస్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా..? ఆర్థిక లావాదేవీలవల్ల ఎవరైనా ఈ దారులను కోడిగట్టారా..? లేక పుచ్చకాయ కోసిన పాత్రల ద్వారా ఏదైనా Jldi పదార్థం లోపలికి వెళ్లిందా..? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది.









