Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా, ప్రజలకు చెప్పని అనేక కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భావనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

నల్లగొండ, మన సాక్షి.

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా, ప్రజలకు చెప్పని అనేక కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భావనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన నల్గొండ నియోజకవర్గస్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు గ్రామ ,మండల స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు ఉచిత సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500రూపాయలకు ఎల్పిజి గ్యాస్, వంటి ఆరు గ్యారెంటీలను ఇచ్చి అమలు చేస్తున్నదని, అంతేకాక ఇవ్వని వాగ్దానాలు, దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్వ ప్రాథమిక విద్య నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వపరంగా మధ్యాహ్న భోజనం అందించనుందని తెలిపారు.

ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనం ,సాయంత్రం సమయంలో అల్పాహారం కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనుందని తెలిపారు.

ఇది తెలంగాణలో విప్లవాత్మకమైన పథకం అని అన్నారు. ఈ పథకం కింద సంవత్సరంలో 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలిపారు .వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉచిత విద్యుత్తు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేయడం జరిగిందని, తిరిగి తమ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ఉచిత బస్సు పథకం కింద రెండు కోట్ల 86 లక్షలు మంది మహిళలు బస్సులలో తిరగడం జరిగిందని, ఉచిత విద్యుత్ కింద 5000 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు . నల్గొండ పట్టణంలో రామగిరి టెంపుల్ నుండి దేవరకొండ రోడ్డు వరకు 15 కోట్ల రూపాయలతో రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని, జాబ్ మేళా ద్వారా 5000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇస్తున్నట్లు చెప్పారు.

న్యాక్ కేంద్రం ద్వారా టైలరింగ్, మెకానిక్ ఇతర ట్రేడులలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, ఇంకా మరిన్ని కోర్సు ప్రవేశపెడతామని తెలిపారు. మహిళలకు ఆసక్తి ఉన్నవారందరికీ ప్రత్యేకించి మిషన్ నేర్చుకున్న వారందరికీ కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పారు. నల్గొండ నియోజకవర్గంలో 740 మంది ఇందిరమ్మ ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఇంకా ఇండ్లు మొదలు పెట్టలేదని, ఈ నెలాఖరు నాటికి చేపట్టిన ఇంద్రమైండ్లన్నీ పూర్తి కావాలని ,ఎవరైనా ఇండ్లు నిర్మించుకునేందుకు ఇష్టం లేనట్లయితే తక్షణమే రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని, అలాంటి జాబితాను సోమవారం నాటికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

అలాంటి వారి స్థానంలో కొత్త లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుందని, జూన్ నుండి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు పొందేందుకు అనుమతి వస్తుందని, అందువల్ల మే చివరినాటికి నిర్మాణం చేపట్టిన ఇండ్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లను నిర్మించడం జరుగుతున్నదని తెలిపారు. ధాన్యం కొనుగోలులో భాగంగా రైతుల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేదని, ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రతి గ్రామం లో ట్రాక్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో దగ్గరగా ఉండేందుకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ నియోజకవర్గస్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలను చదివి వినిపించారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.

ఈ సందర్భంగా కల్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.డిప్యూటీ మేయర్ అష్రాఫ్ అలీ , రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర పవార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు