తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావైద్యం

CPR : ఢిల్లీ వైద్య నిపుణుల బృందంచే సిపిఆర్ శిక్షణ..!

CPR : ఢిల్లీ వైద్య నిపుణుల బృందంచే సిపిఆర్ శిక్షణ..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

సిపిఆర్ హృదయశ్వాసకోశ పునరుజ్జీవన చర్య కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణను సద్వినియం చేసుకొని గుండెపోటు బారిన పడిన వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సమీపంలోని సింగారం వద్ద గల వృత్తి శిక్షణా కేంద్రంలో శుక్రవారం లైఫ్ సేవర్ అసోసియేషన్ ఢిల్లీ వైద్య నిపుణుల బృందంచే సిపిఆర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి ప్రారంభించి మాట్లాడారు. ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోని స్థితిలో ఉన్ననప్పుడు వెంటనే ఆ చర్యల పునరుద్ధరణకు చేయు అత్యవసర ప్రక్రియనే సిపిఆర్ అని ఆమె తెలిపారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాణాలను రక్షించే విధానం ఇదని, తక్షణ హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్య ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడ వచ్చన్నారు.

గుండె ఆగిపోయినప్పుడు లేదా మెదడుకు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తాన్ని ప్రసారం చేయడానికి చాలా అసమర్థంగా కొట్టుకున్నప్పుడు, గుండె ఆగిపోయినప్పుడు ఇది ఒక ప్రాణాన్ని రక్షించడంలో సహాయపడుతుందని, ప్రజలతో మమేకమై ఉండే అధికారులు ఉద్యోగులు సిబ్బంది సిపిఆర్ శిక్షణ తీసుకొని తమ చుట్టుపక్కల లో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈ ప్రక్రియ ద్వారా వారి ప్రాణాలను కాపాడిన వారవుతారని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా ఢిల్లీ వైద్య బృందం డాక్టర్ రాకేష్, అనిల్ మిశ్రా, నీరా గుప్తా, సునీల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్డియోపల్మోనరీ పునరుజ్జీవనం ( సి పి ఆర్ ) అనేది ఛాతీ కుదింపులతో కూడిన అత్యవసర ప్రక్రియ , ఇది తరచుగా కృత్రిమ వెంటిలేషన్‌తో కలిపి లేదా నోటి నుండి నోటిని మాన్యువల్‌గా చెక్కుచెదరకుండా మెదడు పనితీరును మాన్యువల్‌గా కాపాడే ప్రయత్నంలో ఆకస్మిక రక్త ప్రసరణ, శ్వాసను పునరుద్ధరించడానికి తదుపరి చర్యలు తీసుకోబడుతుందనీ అందరికీ చూపించారు. శిక్షణలోనే చాలామంది ఉద్యోగులకు సిపిఆర్ ఎలా చేయాలో అనే దానిపై బొమ్మల ద్వారా చేసి చూపించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా సిపిఆర్ ప్రక్రియను చేసి చూపించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరిమానరుల,జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్, రెవిన్యూ సర్వే ల్యాండ్, మున్సిపల్, విద్యాశాఖ,పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు