Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : చాకచక్యంగా ఇంట్లో గంజాయి మొక్కల పెంపకం..!

Nalgonda : చాకచక్యంగా ఇంట్లో గంజాయి మొక్కల పెంపకం..!

కొండమల్లేపల్లి, మన సాక్షి :

గంజాయి మాదకద్రవ్యాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయినా కూడా ఓ వ్యక్తి ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి సిఐ తెలిపిన వివరాల ప్రకారం గుర్రంపోడు మండలం బుడ్డా రెడ్డి గూడెం గ్రామంలో సింగం ముత్యాలు (60) తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు.

నమ్మదగిన సమాచారం రాగా వెంటనే అట్టి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెలిపి, కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ పర్యవేక్షణలో గుర్రంపోడు మండల వ్యవసాయ అధికారి సమక్షంలో బుడ్డారెడ్డి గూడెం వెళ్లి పరిశీలించగా సింగం ముత్యాలు తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు, మొత్తం 128 గంజాయి మొక్కలను పంచుల సమక్షంలో స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు