సైకో పోవాలి….. సైకిల్ రావాలి

సైకో పోవాలి….. సైకిల్ రావాలి

మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ

మెలియాపుట్టి. మనసాక్షి :

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సైకో జగన్ పాలన పోయి సైకిల్ పాలన రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కోరారు. శ్రీకాకుళం జిల్లా పాత పట్టణం టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కలమట మీడియాతో మాట్లాడారు.

ఏపీలో జగన్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నందుకే ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టామన్నారు. సీఎం జగన్ నిత్యవసర సరుకులు, విద్యుత్ ఛార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల పై మోయలేని భారాలు వేశారని మండి పడ్డారు.రాష్ట్రంలో జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు.

 

ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం లో గుర్తించిన అంశాలను రాజమండ్రి మహానాడులో టిడిపి నేతలతో చర్చిస్తామన్నారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్న టిడిపి నేతలకు కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆయనతోపాటు టిడిపి నేతలు ఉన్నారు.