Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డేట్ ఫిక్స్.. అర్హులు వీరే..!
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డేట్ ఫిక్స్.. అర్హులు వీరే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంది.
గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం వహించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రేషన్ కార్డులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు కూడా దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి నిర్ణయించింది. ప్రజా పాలన ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులకు కూడా ఆహ్వానించింది.
కానీ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉప సంఘంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఇప్పటికి వీరు నాలుగు పర్యాయాలు సమావేశం అయ్యారు.
కాగా వీరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల విషయంపై సమీక్ష నిర్వహించారు. కాగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇది ఇలా ఉండగా కొత్త రేషన్ కార్డులకు ప్రామాణికంగా గతంలో ఉన్న నిబంధనలను తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర , గుజరాత్ రాష్ట్రాలలో బిపిఎల్ కార్డుల మంజూరుకు ఉన్న నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది.
ఇప్పటివరకు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో 1.5 లక్షల రూపాయల ఆదాయం లోపు , పట్టణ ప్రాంతాలలో 2 లక్షల ఆదాయంలోపు ఉన్న వారందరికీ తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా ఈసారి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు అవే నిబంధనలను పాటించే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన సందర్భంలో 10 లక్షల పైగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అందాయి. ఇదిలా ఉండగా అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించిన అనంతరం పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
-
Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!
-
దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
-
TG News : తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి అక్టోబర్ లో ఇందిరమ్మ గృహాలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!
-
Jagityal : ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి.. బీఆర్ఎస్ భారీ ధర్నా..!










