Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!

Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!
మన సాక్షి, కరీంనగర్ :
తనను సివిల్స్ అధికారిగా చూడాలన్న తన తండ్రి కలను నిజం చేయడానికి తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని గ్రూప్ 1లో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించిన నిరుపేద దళిత విద్యార్థిని మొడుంపల్లి మహేశ్వరి ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉన్నత చదువులు ఉత్తమ కెరీర్ లక్ష్యంగా కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన 29ఏళ్ల దళిత నిరుపేద విద్యార్థిని మొడుంపల్లి మహేశ్వరి కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివారు. అనంతరం గోదావరిఖనిలో శాతావాహన యూనివర్సిటీ కాలేజిలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు.
తన కూతురును ఉన్నతాధికారిగా చూడాలనుకుని కుటుంబ పోషణార్థం గల్స్ ప్రాంతానికి వెళ్ళిన మహేశ్వరి తండ్రి మోడుంపల్లి లక్ష్మయ్య 2021లో గుండెపొటుతో చనిపోయారు. వ్యవసాయ కూలి అయిన తన తల్లి ప్రోత్సాహం, ఎలాగైనా తనను ప్రభుత్వ ఉన్నతోద్యోగంలో చూడాలనుకున్న తండ్రి ఆశయాలను నేరవేర్చడానికి తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో చేరారు.
ప్రభుత్వం స్టడీ సర్కిల్ లో కల్పించిన శిక్షణ, స్టడీమెటీరియల్, మాడల్ పరీక్షలు ఇతర సదుపాయలను వినియోగించుకొని చెరగని ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసి గ్రూప్ 1లో డీఎస్పీ ఉద్యొగం సంపాదించారు.
సైబర్ సెక్యూరిటీపై తనవంతుగా అవగాహన కలుగజేస్తూ మహిళా సాధికారతకు కృషిచేస్తూ సివిల్స్ లో విజేతగా నిలవటమే తన లక్ష్యంగా మొడుంపల్లి మహేశ్వరి తెలిపారు.
MOST READ :
-
GOOD NEWS : పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఇళ్ల నిర్మాణాలకు ఇక ఫీజు రూ.1 మాత్రమే..!
-
Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!
-
Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!
-
Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!









