Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ మార్పులు చేస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ లో సైబర్ సెక్యూరిటీ నూతన కోర్సును పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
30 శాతం ప్రజలు ఏదో ఒక సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా సైబర్ సెక్యూరిటీ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండే విధంగా డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సును ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. సైబర్ క్రైమ్ అరికట్టడం తోపాటు వాటిని నిర్మూలించడానికి ఉన్నత విద్యలో సరికొత్త కోర్సును ప్రభుత్వం తీసుకొస్తుంది.
ALSO READ :
- Civil supply : గోదాములు తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు.. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు..!
- SURYAPET : పేగు బంధాన్ని కంప చెట్లలో పడేసిన కసాయి తల్లి..!
- Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
సైబర్ సెక్యూరిటీ పేరిట రూపొందించిన ఈ కోర్సును హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ లో ఉన్న ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తదితరులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మూల్యాంకన పద్ధతులపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రూపొందించిన అధ్యయన నివేదికను కూడా ఆమె విడుదల చేశారు . అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు ఏదో ఒక సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని చెప్పారు. ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించినట్లు ఆమె తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ లో సైబర్ సెక్యూరిటీ కోర్సును నూతనంగా ప్రవేశపెడుతున్నట్లు ఆమె తెలియజేశారు. ఫేక్ సర్టిఫికెట్లను ఆరికట్టేందుకు స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సిస్టం ప్రవేశపెట్టగా ఇది విజయవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కోర్సు విద్యార్థులను సైబర్ యోధులుగా తయారు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు విజ్ఞులత, రవీందర్ ,గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
♦️ప్రత్యేక కోర్సులు ఇవే :
🟢 సైబర్ సెక్యూరిటీ కోర్సును డిగ్రీ సెకండ్ ఇయర్ లో ప్రవేశపెట్టనున్నారు.
🟢 డిగ్రీ సెకండ్ ఇయర్ నాలుగో సెమిస్టర్ లోని బిఏ, బీకాం, బీఎస్సీ అన్ని రకాల కోర్సుల విద్యార్థులకు ఈ కోసం పూర్తి చేయాల్సిందే.
🟢 ఇంట్రడక్షన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ , బేసిక్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అండ్ సైబర్ లాస్, ఇంట్రడక్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్, సోషల్ నెట్ వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఈ కామర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ మాడ్యూల్స్ .
🟢 100 మార్కులు ఉన్న ఈ కోర్సును పూర్తి చేస్తే నాలుగు క్రెడిట్ జారీ చేస్తారు. ప్రాక్టికల్స్ కు 30 మార్కులు, థియరీ ఎగ్జామ్ కు 70 మార్కులు ఇస్తారు.










