Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District Collector : అధికారులు, ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్..!

ప్రభుత్వ కార్యాలయా లను సోమవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయా అని పరిశీలించారు. అధికారులకు, ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

District Collector : అధికారులు, ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్..!

సూర్యాపేట, మన సాక్షి:

అధికారులకు, ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా “సి” సెక్షన్,జిల్లా కోశాధికారి కార్యాలయం,జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఎన్ఐసి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి, హౌసింగ్ కార్యాలయం, తదితర ప్రభుత్వ కార్యాలయా లను సోమవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయా అని పరిశీలించారు.

ఫైల్స్, పిఆర్ రిజిస్టర్, హాజరు పట్టికను పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో అని తనిఖీ చేశారు.అన్ని కార్యాలయాల ఫైల్స్ సక్రమంగా క్రమ పద్ధతిలో ఉండాలని, కార్యాలయాలు పరిశుభ్రంగా ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఉండాలని, హాజరు, పి ఆర్ రిజిస్టర్లు, కార్యాలయాల ఫైల్స్ సక్రమంగా నిర్వహించాలని ప్రతి కార్యాలయ సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏవో సుదర్శన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు