District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ..!
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ..!
కొల్చారం, మన సాక్షి
వసతి గృహ సంక్షేమ అధికారులు అప్రమత్తంగా ఉండి విద్యార్థుల ఉన్నత విద్యా ప్రమాణాలే లక్ష్యంగా పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం కొల్చారం మండలం బీసీ వెల్ఫేర్ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, స్టోర్ రూమ్,
మెనూ, వసతి గృహంలో మరుగుదొడ్ల
పరిశీలించారు.
వసతి గృహ నిర్వాహన తీరు ను పర్యవేక్షించిన అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహాలలో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలని, కొత్తగా చేరిన విద్యార్థులతో ఐకమత్యంగా మెలుగుతూ వారిని వసతి గృహనికి అలవాటయ్యే వరకు అధికారులు పర్యవేక్షించాలని , కొత్తగా చేరిన విద్యార్థుల పై దృష్టి పెట్టి విద్యార్థులతో కలిసి పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్య తో పాటు క్రీడలపై ఆసక్తిని కల్పిస్తూ కొత్తగా చేరిన విద్యార్థుల పట్ల దృష్టి పెట్టాలన్నారు.ఆరోగ్యంతో పాటు పరిశుభ్రత నిర్వహణ నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతినెల వైద్య శిబిరం ఏర్పాటు చేయించాలన్నారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా శానిటేషన్ చేపట్టి చెత్తను తొలగిస్తూ అహల్లాద కరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
కొత్త మెనూ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులతో సమీక్షించాలన్నారు. కలెక్టర్ వెంట బీసీ వసతి గృహ వార్డెన్ ఉమ, వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు తెలుసా.. ముందే గర్తించడం ఎలా.. జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..!
-
ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!
-
TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
-
TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!









