Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పల్లె దావఖాన ఆకస్మిక తనిఖీ..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పల్లె దావఖాన ఆకస్మిక తనిఖీ..!

జగిత్యాల, మన సాక్షి :

వర్షాకాలం సీజనల్  వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్  సూచించారు. మంగళవారం బీర్పూర్ మండలంలోని పల్లె దావఖానను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు.

ఆరోగ్య కేంద్రం ఆవరణంలో పేషంట్ల గదులలో శుభ్రంగా ఉండేలా చూడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఓ.పి సేవలు, రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్, మెడికల్ ఫార్మసి  రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ డియం హెచ్ ఓ. డాక్టర్ శ్రీనివాస్, ఎమ్మార్వో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!

  2. Sub Collector : సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమా హారతి..!

  3. Sub Collector : కల్లూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!

  4. Srisailam : శ్రీశైలం, నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం.. నిండుకుండలా ప్రాజెక్టులు..!

  5. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం..!

మరిన్ని వార్తలు