Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంసంగారెడ్డి జిల్లా

Sub Collector : సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమా హారతి..!

Sub Collector : సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమా హారతి..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నూతన సబ్‌ కలెక్టర్‌ ఉమా హారతి బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు పనిచేసిన ఆర్డీవో అశోక్‌ చక్రవర్తి నుంచి సబ్‌ కలెక్టర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్‌ పరిధిలోని రెవెన్యూ అధికారులను ఆర్టీవో, సబ్‌ కలెక్టర్‌కు పరిచయం చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్లొన్నారు.

సబ్‌ కలెక్టర్‌ను సన్మానించిన ఎమ్మెల్యే 

నారాయణఖేడ్ పట్టణంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్‌ కలెక్టర్‌ ఉమా హారతిని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి సోమవారం శాలువా బొకేతో సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దారం శంకర్‌, దిగంబర్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సబ్‌ కలెక్టర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే 

నారాయణఖేడ్‌ పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్‌ కలెక్టర్‌ ఎన్‌.ఉమా హారతిని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, పుస్తకాలు అందించారు. నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రవీందర్‌ నాయక్‌, నజీబ్‌, నగేష్‌ ఉన్నారు.

MOST READ ; 

  1. Srisailam : శ్రీశైలం, నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం.. నిండుకుండలా ప్రాజెక్టులు..!

  2. District collector : ఎరువుల విక్రయాల్లో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆధార్ నమోదు తప్పనిసరి..!

  3. Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!

  4. TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

మరిన్ని వార్తలు