District collector : పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి.. జిల్లా కలెక్టర్ సూచనలు..!
District collector : పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి.. జిల్లా కలెక్టర్ సూచనలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
విద్యలో వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, కేజీబీవీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ తో పదవ తరగతి విద్యార్థుల ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 40% కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల పై ప్రధానోపాధ్యాయులు అమలు పరుస్తున్న ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అడిగి తెలుసుకున్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షలలో మంచి ఫలితాల సాధన కొరకు వివిధ సూచనలు చేశారు. వెనకబడ్డ విద్యార్థులతో ప్రాక్టీసు పెంచుటకు, ఆ విద్యార్థులను అడాప్షన్ తీసుకున్న ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని కలెక్టర్ తెలిపారు.
వివిధ విషయాల్లో గతంలో వచ్చిన ప్రశ్న పత్రాల ను అనాలసిస్ చేసి సి,డి గ్రేడ్ విద్యార్థులతో ప్రాక్టీసు చేయించాలని సూచించారు. గ్రాండ్ ఫైనల్ కల్లా అందరూ విద్యార్థులు 100% హాజరు అయ్యేలా జాగ్రత్త వహించాలని, గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం పెంచుటకు ప్రధానోపాధ్యాయులు అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల, డి. ఈ. ఓ. గోవిందరాజు డిసిసిబి సెక్రటరీ రాజేంద్ర కుమార్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు విద్యాసాగర్, శ్రీనివాస్, ఏం డి ఏం ఇన్చార్జి యాదయ్య శెట్టి, జిల్లా లోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో జమ.. బిగ్ అప్డేట్..!
-
Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)
-
MLC Kavitha : కేసిఆర్ పాలన ఐఫోన్.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్లకు కొత్త నిబంధనలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!
-
Gold Price : బంగారం ఆల్ టైం రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..!









