District collector : జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. వైద్య సేవలపై కీలక ఆదేశం..!
District collector : జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. వైద్య సేవలపై కీలక ఆదేశం..!
కరీంనగర్, మనసాక్షి:
కరీంనగర్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగాన్ని, మాత శిశు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలను, పలు సౌకర్యాలను పరిశీలించారు. క్రిటికల్ కేర్ విభాగంలోని ఐసియు, వార్డులు, ఆపరేషన్ థియేటర్ ఇతర బ్లాక్ లను సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిటికల్ కేర్ విభాగం నిర్వహణకు అవసరమైన ఆక్సిజన్ లైన్ సమకూర్చుకోవాలని, అవసరమున్న ఇతర సౌకర్యాలు, మరిన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని రకాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు వైద్యులను, ఇతర సిబ్బందిని సర్దుబాటు తీసుకోవాలని అన్నారు.
అలాగే మాతా శిశు విభాగంలో సందర్శించిన ఆమె ఓపి విభాగం, స్కానింగ్ గదిని పరిశీలించారు. గర్భిణీలతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గర్భిణీకి టీఫా పరీక్ష తప్పనిసరి అని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని గర్భిణీలకు తెలిపారు. ఓపి విభాగంలో ఉక్కపోత వల్ల గర్భిణీలు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వెంటనే వీలైనన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
ఆస్పత్రి ఆవరణలో షెడ్ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. చెప్పులు విడిచేందుకు ప్రత్యేక ర్యాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ నవీనా పాల్గొన్నారు.
MOST READ :
-
Good News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Sub Collector : మదనపల్లె సబ్ కలెక్టర్ గా ఎవరో తెలుసా..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!










