District collector : జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. ఆకస్మిక తనిఖీలు.. కీలక ఆదేశాలు జారీ..!
District collector : జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. ఆకస్మిక తనిఖీలు.. కీలక ఆదేశాలు జారీ..!
ఆర్మూర్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు.
గ్రామాల వారీగా దరఖాస్తులు ఎంత మేరకు పరిష్కారమయ్యాయో, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయో తెలుసుకుంటూ, ప్రతిరోజూ దరఖాస్తులను పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలన్న తహసిల్దార్ రమేష్ గాకలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
తర్వాత మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీఓ గంగాధర్ నుండి వివరణలు తీసుకుని,ముఖ్యంగా ఇన్దిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.పనులు వేగవంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు అందించారు.
అంతేకాకుండా ఆలూర్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి, పనుల నాణ్యత, పురోగతి గురించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి సమయానికి పూర్తి కావడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే, ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవల పై వివరాలు అడిగారు. అనంతరం స్థానిక సహకార సంఘం గోదాంను తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, తరలింపు వ్యవహారాలు సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, రాబోయే యాసంగి సాగులో కూడా ఎరువుల సరఫరా నిరంతరంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పట్టా పాస్ పుస్తకాలు లేని రైతులు కూడా నిజంగా పంటలు సాగించినట్లయితే వారికి విడుదల కావాల్సిన ఎరువులు అందజేయాలని, పంటల వేసిన ప్రతి రైతుకు ఎరువులు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.దీంతోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కూడా సందర్శించి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు మెనూ నిబంధనలు అనుసరించాల్సిందిగా హెడ్ మాస్టర్ సహా అధికారులను సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్, ఎంపీడీవో గంగాధర్, గ్రామ సెక్రటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగి సస్పెండ్..!
-
TATA AIA : భారతదేశపు సూపర్‌ఉమెన్ జీవితాన్ని సంరక్షించేందుకు శుభ్ శక్తిని ఆవిష్కరించిన టాటా ఏఐఏ లైఫ్..!
-
Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!
-
Kodada : కోదాడ క్లస్టర్ ఉద్యాన విస్తరణ అధికారిగా ముత్యంరాజు.. ఎవరో తెలుసా..!
-
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!











