TATA AIA : భారతదేశపు సూపర్‌ఉమెన్ జీవితాన్ని సంరక్షించేందుకు శుభ్ శక్తిని ఆవిష్కరించిన టాటా ఏఐఏ లైఫ్..!
TATA AIA : భారతదేశపు సూపర్‌ఉమెన్ జీవితాన్ని సంరక్షించేందుకు శుభ్ శక్తిని ఆవిష్కరించిన టాటా ఏఐఏ లైఫ్..!
ముంబై, మన సాక్షి:
ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన “శుభ్ శక్తి” టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆవిష్కరించింది. ఇది జీవిత బీమా పథకానికి మించి, మహిళల జీవితంలోని ప్రతి దశలోనూ ఉండే విశిష్ట పరిస్థితులు, ఆర్థిక అవసరాలకు సమగ్ర రక్షణ కల్పించే విధంగా ఉంటుంది. తాము వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ముందుకు సాగుతూ, తమతో పాటు తమకెంతో ఇష్టమైన వారికి కూడా భద్రత కల్పించేందుకు ఇది తోడ్పడుతుంది.
సాధారణంగా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పురుషుల ఆధారితమైనదిగా ఉంటూ, ఆదాయాలార్జించే పురుషుల అవసరాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టేదిగా ఉంటూ, విశిష్టమైన సవాళ్లు ఎదుర్కొనే మహిళలను అంతగా పట్టించుకోని విధంగా ఉండేది. కానీ నేడు, ప్రతి భారతీయ మహిళ అడ్డంకులను అధిగమిస్తూ, వర్క్‌ఫోర్స్‌లో లీడర్లుగా ఎదుగుతున్నారు.
వ్యాపారవేత్తలుగా, ఆర్థిక నిర్ణేతలుగా ఉంటున్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో కార్మిక శక్తిలో మహిళల వాటా (ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు) 23.3 శాతంగా ఉండగా 2024 ఆర్థిక సంవత్సరంలో 41.7 శాతానికి పెరిగింది. ఆర్థిక వ్యవహారాల్లో తోడ్పాటు అందించడంతో పాటు తమ ఆర్థిక భవిష్యత్తును సంరక్షించుకోవడంలోనూ వారు ముందుంటున్నారు.
ఆర్థిక స్వాతంత్ర్య సాధనలో మహిళలు ముందుకు వెళ్తున్నప్పటికీ, ఇప్పటికీ, 89 శాతం మంది వివాహితలు, ఆర్థిక ప్రణాళికల కోసం తమ భర్తలపైనే ఆధారపడుతున్నారని, 44 శాతం మంది మాత్రమే అవకాశం లభిస్తే స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇటీవలి టాటా ఏఐఏ సర్వేలో వెల్లడైంది. మహిళలకు ఎదురయ్యే విశిష్టమైన ఆర్థిక అవసరాలు, సవాళ్లను నిర్దిష్టంగా పరిష్కరించే సొల్యూషన్ తక్షణ ఆవశ్యకతను ఈ అంతరాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మంచి వార్త. అదేంటంటే, పరిస్థితులు మారుతున్నాయి.
ఏడాది వ్యవధిలోనే 42 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తూ, 2024 డిసెంబర్‌లో 2.7 కోట్ల మంది తమ క్రెడిట్ స్కోర్లను ట్రాక్ చేసుకున్నారు. మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం గురించి అవగాహన పెరుగుతుండటాన్ని, వారు ఆ దిశగా మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది.
“శుభ్ శక్తి” – మహిళల సామర్థ్యాలకు జోహారు
“భారతీయ మహిళలు తమ ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నప్పటికీ, వారికి విస్తృత స్థాయిలో బీమా భద్రత ఉండటం లేదు.
దీంతో ఏదైనా విషాదం చోటు చేసుకుంటే వారి కుటుంబాల పరిస్థితి సంక్లిష్టంగా మారే ముప్పు ఉంటోంది. శుభ్ శక్తి రూపంలో నేటి మహిళల సామర్థ్యాలకు అనుగుణంగా ఉండే సొల్యూషన్‌ను అందిస్తున్నాం. వారు తమ కుటుంబం యొక్క భవిష్యత్తును సంరక్షించుకునేందుకు, తమ ఆరోగ్యంపై ఇన్వెస్ట్ చేసేందుకు, నిశ్చింతగా జీవితాన్ని గడిపేందుకు తోడ్పడేలా సాధికారతను అందిస్తున్నాం. మహిళలు తమకెంతో ప్రియమైన వారి భద్రత విషయంలో రాజీపడకుండానే జీవితపు సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనగలిగేలా, తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేలా, నిశ్చింతను పొందేలా ఇది ఉంటుంది” అని టాటా ఏఐఏ చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్ గాయత్రి నాథన్ తెలిపారు.
శుభ్ శక్తి: జీవితపు ప్రతి దశలోనూ మీకు భద్రత కల్పించే పథకం మహిళల విశిష్ట అవసరాలు రకరకాలుగా ఉంటాయనే విషయాన్ని అర్థం చేసుకుని టాటా ఏఐఏ శుభ్ శక్తి రూపొందించబడింది. ఇది సరళతరంగా, సమగ్రంగా ఉంటుంది. మాతృ మూర్తులుగా, కుమార్తెలుగా, భాగస్వాములుగా, ప్రొఫెషనల్స్‌గా వివిధ పాత్రలు పోషించే మహిళలకు తోడ్పడే విధంగా ఇది ఉంటుంది.
మహిళల ఆధారిత ప్రయోజనాలు ప్రెగ్నెన్సీ సమయంలో ప్రీమియం హాలిడే ప్రతి డెలివరీ తర్వాత 12 నెలల పాటు, మొత్తం మీద రెండు ప్రీమియం బ్రేక్‌లను పొందవచ్చు. ఆర్థిక భారం గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీరు మీ ఆరోగ్యం, శిశువుపైనా దృష్టి పెట్టేందుకు ఇది తోడ్పడుతుంది.
పురుషులతో పోలిస్తే మహిళల ప్రీమియం సుమారు 15 శాతం తక్కువగా ఉంటుంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి (పీపీటీ) ఆసాంతం, ప్రతి సంవత్సరం ఇది వర్తిస్తుంది.
సింగిల్ మదర్స్‌కి ఈ 15 శాతం డిస్కౌంటుకు అదనంగా, ప్రీమియంపై 1 శాతం మేర లైఫ్‌టైమ్ డిస్కౌంటును కూడా ఈ పాలసీ అందిస్తుంది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక హెల్త్ బెనిఫిట్స్:
పీసీవోడీ సపోర్ట్, ఐవీఎఫ్ కౌన్సిలింగ్, బరువు నియంత్రణ సహా మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన సవాళ్లకు సంబంధించిన సంరక్షణ
సర్వికల్ క్యాన్సర్, హెచ్‌పీవీ, ఫ్లూ మొదలైన వాటికి వేక్సినేషన్ సపోర్ట్ స్పెషలిస్టులతో కన్సల్టేషన్లు, వార్షికంగా హెల్త్ చెకప్‌లు, లైఫ్‌స్టయిల్ పరిస్థితుల నియంత్రణ మొదలైన ప్రయోజనాలు.
పిల్లల చదువుకు రక్షణ
మీ పిల్లల కలల సాకారానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. జీవితంలో మీకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా సరే, వారి చదువుకు ఎలాంటి ఆటంకాలు రాకుండా వారికి 25 ఏళ్లు వచ్చే వరకు 3 పిల్లల వరకు నెలవారీగా ఆదాయం పొందవచ్చు.
ప్రమాదవశాత్తు మరణించినా లేక భర్త మరణించినా ప్రీమియం వెయివర్ ఏదైనా అనుకోని సంఘటన జరిగినా, కుటుంబ ఆర్థిక భద్రతకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా, తదుపరి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాలసీ కొనసాగుతుంది.
టాటా ఏఐఏ హెల్త్ బడ్డీ – ఆరోగ్యకరమైన జీవితానికి బహుమతి
ఆరోగ్యకరమైన, ఒత్తిడిరహితమైన జీవితం సాగించాలంటే సరైన మద్దతు కూడా లభించాలి. శుభ్ శక్తిలో అంతర్భాగమైన టాటా ఏఐఏ హెల్త్ బడ్డీ, వెల్‌నెస్ పాటించేలా మహిళలను ప్రోత్సహించే విధంగా, సమగ్రంగా ఉంటుంది. హెల్త్ బడ్డీతో కూడుకున్న శుభ్ శక్తి పాలసీ ఇటు ఆరోగ్యం అటు సంపదను సంరక్షించుకునే సమగ్ర సొల్యూషన్‌గా ఉపయోగపడుతుంది.
బహుమతులనిచ్చే వెల్‌నెస్: తరచుగా హెల్త్ చెకప్‌లు చేయించుకుంటూ, ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధిస్తూ రివార్డులను గెల్చుకోండి. కుటుంబానికి ఆరోగ్యం, సంక్షేమం: కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండేలా మీకు ప్రియమైన వారికి కూడా ప్రయోజనాలు కల్పించండి.
లైఫ్‌స్టయిల్ సూచనలు:
ఫిట్‌గా ఉండేందుకు వ్యక్తిగతీకరించిన డైట్ టిప్స్, యాక్టివిటీ టార్గెట్లు, రివార్డులు. అఫోర్డబుల్: మహిళల కోసం 15 శాతం తక్కువ ప్రీమియంలు. అదనంగా డిజిటల్ కొనుగోళ్లపై, శాలరీడ్ ప్రొఫైల్స్‌కి జీవితకాల డిస్కౌంట్లు. మీ కుటుంబానికి శుభ శక్తిగా నిలవండి
టాటా ఏఐఏ శుభ్ శక్తి అనేది జీవిత బీమా పథకం మాత్రమే కాదు. మహిళలకు శక్తిని, స్వాతంత్ర్యాన్ని, భద్రతను కల్పించే మహత్తర సాధనం.
మహిళల ఆరోగ్యం, కుటుంబానికి భద్రత, ఆర్థిక సాధికారత కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టేలా రూపొందించిన సమగ్రమైన ప్రొటెక్షన్ సొల్యూషన్. శుభ్ శక్తితో మీరు నిశ్చింతగా కలలు కనొచ్చు. ఆత్మవిశ్వాసంతో జీవించవచ్చు. అలాగే సురక్షితమైన, ఆరోగ్యకరమైన, ఆర్థికంగా స్వతంత్రమైన భవిష్యత్ దిశగా మీ కుటుంబాన్ని ముందుకు నడిపించవచ్చు.
శక్తివంతమైన మహిళలకు, శక్తివంతమైన రక్షణ కవచం అవసరం.
MOST READ :
-
Gold Price : బంగారం ధరలకు ఇక బ్రేక్.. ఈరోజు తగ్గిందెంత.. తులం ధర ఎంతంటే..!
-
Robot : అచ్చం అమ్మాయిలా ఆకట్టుకున్న రోబో.. ప్రసంగించిన తీరుకు విద్యార్థినుల ఫిదా..!
-
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!
-
District collector : ప్రభుత్వ పాఠశాలలో దగ్గరుండి మెనూ పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
Alumni : 22 ఏళ్ల స్నేహబంధం.. ఆత్మీయ సమ్మేళనం..!








