Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

District collector : ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!

District collector : ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!

చింతపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్. శ్రీదేవి ఎలాంటి ఆపరేషన్లు లేకుండా నార్మల్ గా మహిళ గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఓ గర్భిణీ మహిళలకు నార్మల్ డెలివరీ చేయించారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. దీంతో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి బుధవారం చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశీలించి ఔట్ పేషెంట్, ఒపీ గర్భిణీలకు అందిస్తున్న రిజిస్టర్లను ఆమె తనిఖీ చేశారు.

అవుట్ పేషంట్, ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ అయిన పేషంట్లతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పేషెంట్లను ఒక్కొక్కరిని మందలిస్తూ మందులు మంచిగా ఇస్తున్నారా, డాక్టర్లు సరిగా చూస్తున్నారా అనిబెడ్లపై ఉన్న పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. స్టాప్ అందరూ సమయానికి వచ్చి పని చేస్తున్నారా గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా నడుస్తున్నాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్ట్ కాళీ ఉన్నందున భర్తీ చేయాలని డాక్టర్ శ్రీదేవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఆశ వర్కర్లు విధులను ఎలా నిర్వర్తిస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలు చేయడానికి కావలసిన సదుపాయాలన్నింటినీ సమకూరుస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి నిరుపేద ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి బాగున్నాయనిసంతృప్తి వ్యక్తం చేశారు.

సిబ్బంది ప్రతిరోజు సమయానికి హాజరై తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణ కలిగి పనిచేయాలని సిబ్బందికి సూచించారు.  మనం చేసే సేవనే ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారని ఆమె పేర్కొన్నారు.ఈ ఆస్పత్రికి అన్ని విధాలుగా కావలసిన సదుపాయాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడమే మన కర్తవ్యం అని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఇక్బాల్, ఏ ఎంలు, ఆశా వర్కర్లు ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!

  2. CM Revanth Reddy : హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. హెలిప్యాడ్ ఏర్పాట్లు పూర్తి..!

  3. Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!

  4. Eye Health : ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్లజోడును తప్పనిసరిగా మార్చాల్సిందే.. కంటి ఆరోగ్యం కోసం..!

  5. Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!

మరిన్ని వార్తలు