Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

District collector : జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరెండర్..!

District collector : జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరెండర్..!

నల్లగొండ, మన సాక్షి :

పాఠశాలతో పాటు, వంటగది, డైనింగ్, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినందుకుగాను శాలిగౌరారం మండలం వల్లాల ఆదర్శ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కె. కృష్ణమోహన్ ను సరెండర్ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

మంగళవారం ఆమె వల్లాల మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంటగదిని, వంటగదిలోని సరుకులను, వంటగది పరిసరాలను, అదేవిధంగా పాఠశాల పరిసరాలను తనిఖీ చేసిన సందర్భంగా వంట గదిలో అపరిశుభ్ర వాతావరణం ఉండడం, అంతేకాక సరుకులు, కూరగాయలు అన్నింటిని శుభ్రంగా ఉంచకపోవడం ,వీటన్నింటి పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ కె. కృష్ణ మోహన్ ను సరెండర్ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఆయా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారితో వివిధ అంశాలపై ప్రశ్నలు, జవాబులు అడిగి తెలుసుకున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు