Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ధాన్యంకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ధాన్యంకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్..!

మాడుగులపల్లి,  మన సాక్షి :

మాడుగులపల్లి మండల పరిధిలోని గారకుంటపాలెం, గ్రామంలో బుధవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకెపి కొనుగోలు కేంద్రంను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా గుర్రప్ప గూడెం, ఆగా మోత్కూర్ చిరుమర్తి,పాములపాడు గ్రామాలలో డిపిఎం సోమయ్య, మండల ఏపిఎం మధుసూదన్ లు కలిసి దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకానికి అప్పజెప్పి నష్టపోతున్నారనే భావనతో ప్రభుత్వమే జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా రైతుల నుండి నేరుగ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.

రైతులు కూడా సంఘాలకు సహకరిస్తూ తన వ్యవసాయ భూమిలో కోసినటువంటి పంటను నాణ్యతగా పచ్చి మరియు తాలు లేకుండా చూసుకుని ఐకేపీ సెంటర్లకు తీసుకువస్తే సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి సంఘా సభ్యులు ధాన్యం మ్యాచర్ను బట్టి వెంటనే కాంటాలు వేయడం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం గ్రేడ్ ఏ రకానికి 2389, సాధారణ రకానికి 2369 గా ప్రభుత్వం నిర్ణయించిందని సన్నాలకు క్వాంటకు 500 బోనసు కూడా అందిస్తుందని, రైతులు ఇది గ్రహించి సంఘాలకు సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సరోజ పావని, ఇన్చార్జ్ ఎంపీడీవో సంగీత, శివరాం కుమార్,సీసీలు రమణ,ప్రసాద్, నాకు పెట్టినావాసంఘ అధ్యక్షులు సోమయ్య, సావిత్రమ్మ, రేణుక, అనిత, సలోమి,సరిత లక్ష్మీరెడ్డి , మహేందర్, జాన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Heavy Rain : అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి పంటలు.. అయోమయంలో రైతులు..!

  2. Doctorate : న్యూడిల్లీ భారత్ యూనివర్సిటీచే ఈశ్వరయ్యకు డాక్టరేట్..!

  3. Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!

  4. TG News : తెలంగాణలో మంత్రుల మద్య వివాదం ముగిసిందా.. పొన్నం ఏం చెప్పారు..!

మరిన్ని వార్తలు