District collector : భూ భారతి పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ సమస్యలు ఆర్డీవో పరిధిలోనే పరిష్కారం..!

District collector : భూ భారతి పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ సమస్యలు ఆర్డీవో పరిధిలోనే పరిష్కారం..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి,
భూ భారతి పోర్టల్ లో కొన్ని మాడ్యూల్స్ లో భూ సమస్యలు ఆర్డిఓ పరిధిలో పరిష్కారం చేయడం జరుగుతుందని, దరఖాస్తు దారులు అనవసరంగా కలెక్టరేట్ కు వచ్చి ఇబ్బంది పడవద్దని
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ భారతి చట్టంలోని కొన్ని మాడ్యూల్స్ లో పరిష్కారం.. ఆర్.డి.ఓ స్థాయిలో లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
వాటిలో
1. మార్కెట్ విలువ 5 లక్షల కంటే తక్కువ ఉన్న మిస్సింగ్ సర్వే నెంబర్
2. భూ విస్తీర్ణ సవరణ
3. పట్టా పాస్ పుస్తకం డిజిటల్ సైన్
4. పట్టా పాస్ పుస్తకం లోని పేరు సవరణ
5. పెండింగ్ మ్యూటేషన్
6. పెండింగ్ సక్సేషన్
7. నాలా
8. కోర్ట్ కేసు పిపిబి మరియు
9. నాల నుండి అగ్రికల్చర్ మార్చుకొనుట వంటి సమస్యలు ఆర్డిఓ కార్యాలయంలో పరిష్కారం అవుతాయని, వీటి కోసం అనవసరంగా కలెక్టరేట్ కు వచ్చి ప్రజలు ఇబ్బంది పడవద్దని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
MOST READ :
-
Hyderabad : మియాపూర్ లో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి…!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద ప్రవాహం.. అవుట్ ఫ్లో 4.83 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Doctorate : తండ్రి స్వీపర్.. తనయుడికి డాక్టరేట్..!
-
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!









