Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Doctorate : తండ్రి స్వీపర్.. తనయుడికి డాక్టరేట్..!

Doctorate : తండ్రి స్వీపర్.. తనయుడికి డాక్టరేట్..!

గరిడేపల్లి, మన సాక్షి

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన యడవల్లి సైదులు నిరుపేద రజక కుటుంబంలో పుట్టాడు. తండ్రి లచ్చయ్య గ్రామ పాఠశాలలో 30 సంవత్సరాలుగా స్వీపర్ గా పనిచేస్తూ, తల్లి ఎల్లమ్మ కూలీనాలీ చేస్తూ కొడుకు కల నిజంచేయడానికి నిరంతరం కృషి చేశారు.

ఒకప్పుడు కరెంటు సౌకర్యం కూడా లేని ఇంట్లో పెరిగిన సైదులు తన తండ్రి స్వీపర్ గా డ్యూటీ చేస్తూ పడిన కష్టాలూ,అవమానాలు, బాదలు చూసి అందరూ మెచ్చేలా ఉన్నత స్థాయి జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

అందుకోసమై చిన్న నాటి నుంచి ఎంతో కష్టపడి చదివి, ఎన్నో కష్టాలను తట్టుకొని నిలబడి ఉన్నత విద్యలు అభ్యసించి ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా టీచింగ్ చేస్తున్నాడు. సైదులు ఒకవైపు టీచింగ్ ,మరో వైపు పరిశోధన చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ సాధించడం విశేషం.

ఇతను గ్రామంలో మొదటిసారి డాక్టరేటు పొందినవారని గ్రామస్తులు చెబుతున్నారు.
హైదరాబాద్ లోని ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ చాన్సలర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ఇస్రో చైర్మన్ పాల్గొని వారి చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందజేశారు.

నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా యడవల్లి సైదులుకి బంధువులు,మిత్రులు, మండల ప్రజలు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా డా యడవల్లి సైదులు మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతి గల ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ ప్రయాణంలో తల్లిదండ్రుల త్యాగం, ప్రోత్సాహం, సహకారం గొప్పదన్నారు. తన కుటుంబ సభ్యులందరూ తనని డాక్టరేట్ గా చూడాలని కలలుకన్నారు.అందుకు ఎంతో వెన్నుతట్టారు అన్నాడు. అలాగే తనకి పాఠాలు చెప్పిన గురువుల దీవెనలు తనమీద ఉండటం వలనే నేను ఇంతటి అర్హతను పొందానని యడవల్లి సైదులు అన్నారు.

నైతిక విలువలు, భాధ్యతలు మరిచి డబ్బు సంపాదనే ధ్యేయంగా నేటి యువతరం పరుగెడుతుందని, కానీ అది సరైంది కాదన్నారు. జ్ఞాన్నాని ఉత్హమ మార్గంలో పొంది నలుగురుకి పంచుతూ ధర్మoగా ఎదగాలని అటువంటి యువతరాన్ని తన రచనల ద్వారా , బోధనల ద్వారా తయారుచేయాలని తను అనుకుంటున్నట్లు సైదులు తెలిపారు.

నిత్యం పరిశోధనలు చేసే వారికి సమాజంలో మంచి పేరుప్రతిష్ఠలు వస్తాయనటానికి తానే సాక్ష్యం అని తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులకు, మిత్రులకు, తన ఉన్నతిని కోరుకునే గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

MOST READ : 

  1. Urea : ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పిఎసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతన్న రైతులు.. (వీడియో)

  2. Godavarikhani : అక్రమ కట్టడాల కూల్చివేత.. భారీగా మోహరించిన పోలీసులు..!

  3. District collector : నానో యూరియా తో అధిక దిగుబడి.. రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  4. Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!

మరిన్ని వార్తలు