తెలంగాణకరీంనగర్జిల్లా వార్తలువిద్య

District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలి..!

విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రీ ప్రైమరీ చిన్నారులకు యూనిఫామ్, పుస్తకాలు, స్టేషనరీ కిట్ అందజేశారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలి..!

కరీంనగర్, మనసాక్షి:

విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రీ ప్రైమరీ చిన్నారులకు యూనిఫామ్, పుస్తకాలు, స్టేషనరీ కిట్ అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 33 ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించామని తెలిపారు. నైపుణ్యం గల శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనను అందిస్తారని అన్నారు. ప్రత్యేక సెలబస్ ద్వారా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పూర్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత, నాణ్యమైన విద్య అందుతోందని యూనిఫాం, పుస్తకాలు వంటివి ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ప్రీ ప్రైమరీ చిన్నారులకు ఉచితంగా షూ అందజేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పిల్లల నమోదు, హాజరు పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.

పర్లపెల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాఠాలు చదివించారు. రోజు చదవడం, రాయడం తప్పనిసరిగా అలవర్చుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు పాఠాన్ని చెప్పడమే కాకుండా విషయాన్ని అర్ధం చేయించడం చాలా ముఖ్యమని తెలిపారు. బుధవారం బోధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సూరం స్వప్న, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ ఎం మంజుల తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో కార్యాలయ రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్..!

  2. Miryalaguda : NH 167 విస్తరణకు గడువు ముగిసినా ఖాళీ చేయని ఇళ్ల యజమానులు.. సబ్ కలెక్టర్ నోటీసులు..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆగని వలసలు.. బీ ఆర్ ఎస్ లో భారీగా చేరికలు..!

  4. TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు