తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :-

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి ఆర్పీలతో, ఉపాధ్యాయులతో మమేకమై తరగతి మాదిరిబోధన నిషితంగా తెలుసుకున్నారు.

కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ తీరు తెన్నులను గమనించి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అకాడమిక్ లీడర్షిప్ తీసుకోవాలని విద్యార్థుల స్థాయిని బట్టి వారికి అర్ధమయ్యే విధంగా బోధన జరపాలని అందుకు ఉపాధ్యాయులను సంసిద్ధులను చేయుటకు కాంప్లెక్ సమావేశాలు వినియోగించాలి అని సూచించారు.

పాఠశాలల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను డ్యాష్ బోర్డ్ ఆధారంగా సమీక్షించి, మెరుగైన బోధనా పద్ధతులు అమలుచేయాలని, విద్యార్థులతో మమేకమై బోధన చేయాలన్నారు. వెనకబడ్డ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.

ఆంగ్లము, తెలుగు అనర్గళంగా మాట్లాడేలా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించి రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఆత్మవిశ్వాసం తో రాయలనీ సూచించారు.

మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మెనూ పాఠించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ పై క్రమశిక్షణా చర్యలు తీలుకోవాలని డీ ఈఓ ను ఆదేశించారు.
సమీక్షలో డీఈఓ గోవిందరాజు, ఏ ఎమ్ ఓ విద్యాసాగర్ ఎమ్ ఈఓ బాలాజీ, కాంప్లెక్స్ ప్రాధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

■ MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!

  2. SLBC : ఎస్ఎల్బీసీ సారంగ ప్రమాదంలో.. 8 మంది గల్లంతు..!

  3. Suryapet : కలెక్టర్ సారు మాపై దయ చూపండి.. పెద్దగట్టు జాతర వ్యాపారుల మొర..! 

  4. Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!

  5. District collector : ఎలాంటి సమస్య వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు