District Collector : చెరువులు , కుంటల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులతో సమీక్ష..!
District Collector : చెరువులు , కుంటల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులతో సమీక్ష..!
నల్గొండ, మనసాక్షి:
చెరువులు, కుంటల్లో ఆక్రమణలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె ఉదయాదిత్య భవన్లో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు, తహసిల్దార్లతో జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల ఆక్రమణలపై సమీక్ష నిర్వహించారు.
గతంలో జరిగిన ఆక్రమణలను తక్షణమే అరికట్టాలని, కొత్తగా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా అన్ని లేఔట్లు, పర్మిషన్లను నీటిపారుదల శాఖ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడైనా చెరువులను ఆక్రమిస్తే వెంటనే పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పారు.
ఇకపై జిల్లాలో ఎలాంటి ఆక్రమణలు జరగరాదని, నిర్మాణాలు అసలే జరగ రాదని చెప్పారు. ఇకపై నిర్మాణాల అనుమతి విషయంలో తహసిల్దారులు ,ఆర్టీవోలు తప్పనిసరిగా ఇరిగేషన్ శాఖ నుండి “నో అబ్జెక్షన్ “సర్టిఫికెట్ ను తప్పనిసరిగా తీసుకునే విధంగా చూడాలన్నారు. లేఔట్ పర్మిషన్లు, ఇంటి నెంబర్ల విషయమై కచ్చితంగా వ్యవహరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను ఆదేశించారు.
మిర్యాలగూడ డివిజన్లో ఇరిగేషన్ చెరువులకు సంబంధించి సర్వే ను త్వరితగతిని పూర్తి చేసి, జియా కోఆర్డినేటర్స్ తయారుచేసి ఒక మోడల్ డివిజన్ గా తయారు చేయాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ను ఆదేశించారు రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి పర్వతీశ్వరరావు,సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి సుజాత, తహసిల్దారులు హాజరయ్యారు.
MOST READ :
-
Suryapet : సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ ఎవరో తెలుసా..!
-
Annadata Sukhibhava : రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : పేద విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు.. దాతలు సహకరిస్తేనే జాయినింగ్..!
-
TG News : బోనాల పండుగ వేళ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్..!
-
Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)









