Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

District collector : వైద్యులకు జిల్లా కలెక్టర్ ఆఫర్.. వారికి నగదు పారితోషికం..!

District collector : వైద్యులకు జిల్లా కలెక్టర్ ఆఫర్.. వారికి నగదు పారితోషికం..!

నల్లగొండ, మన సాక్షి :

వైద్య వృత్తిలో పనిచేయడం చాలా గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులకు ఉద్దేశించి ఇమ్యునైజేషన్ పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

అంతేకాక రాష్ట్ర కుటుంబ, వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారులకు ఉద్దేశించి రూపొందించిన కరదీపికను విడుదల చేశారు. అనంతరం ఆమె శిక్షణ కార్యక్రమానికి హాజరైన వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ వైద్యవృత్తి అత్యంత పవిత్రమైందని, అలాంటి వృత్తిలో పనిచేయడం గొప్ప విషయం అని అన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం ఉదయం 9 నుండి 4 గంటల వరకు ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా ఆసుపత్రిలో ఉండి పనిచేయాలన్నారు. ఇకపై బాగా పనిచేసిన వైద్యాధికారులకు వారి పనితీరు ఆధారంగా ప్రతినెల ఒకరికి 16 వేల రూపాయల చొప్పున పారితోషకం అందజేస్తామని ప్రకటించారు.

ఇందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ నిర్ణయించిన వారికి ఈ పారితోషకాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. డాక్టర్లు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని, వైద్యులకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ ఓలు, ప్రోగ్రాం అధికారులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యాక్సినేషన్ లో వచ్చిన కొత్త విషయాలు, వైద్యులు పాటించాల్సిన ప్రోటోకాల్ తదిత అంశాలపై పొందుపరచడం జరిగింది.

MOST READ : 

మరిన్ని వార్తలు