Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!
Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!
కేతేపల్లి, మన సాక్షి:
ఉస్మానియా యూనివర్సిటీ నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఓ రైతు బిడ్డ డాక్టరేట్ సాధించారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కోర్లపహాడ్ గ్రామానికి చెందిన వంటేపాక దేవదానం శారమ్మల చిన్న కుమారుడు వంటపాక గణేష్ వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ విద్యాభ్యాసమంతా గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉత్తమ ఫలితాలు సాధించారు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గణేష్ ఉన్నత విద్య సాధించాలని లక్ష్యంతో హైదరాబాద్ వెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ బోడ హద్యా ఆధ్వర్యంలో “అధునికత టెక్నాలజీ కలిగిన ఇంజన్లలో బయో ఫ్యూయల్స్ వినియోగంపై” పరిశోధనలు చేసి, మంచి ఫలితాలను సాధించారు.
గణేష్ చేసిన నాలుగు పరిశోధన పేపర్లు జాతీయ,అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించడం తో ఈ కృషికి గుర్తింపుగా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక బృందం గణేష్ కు పీహెచ్.డి. ( డాక్టరేట్ ) పట్టా ప్రదానం చేసింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, గురువులు, సహచరులు, తదితరులు గణేష్ ను అభినందించి సత్కరించారు.
MOST READ :
-
Huzurnagar : హుజూర్‌నగర్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!
-
Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ఆ నిందితుడికి ఉరిశిక్ష..!
-
Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!









