శ్రీకాకుళం : కుక్కల దాడిలో దుప్పికి గాయాలు

కుక్కల దాడిలో దుప్పికి గాయాలు

మెలియాపుట్టి. మన సాక్షి.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తిడ్డిమి రహదారిలో ఉన్న కస్తూరిబా స్కూల్ సమీపములో కుక్కల దాడిలో గాయపడిన చుక్కల దుప్పిని స్థానికులు గుర్తించారు.

 

వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని చుక్కల దుప్పిని అటవి శాఖ కార్యాలయానికి తరలించి ప్రధమ చికిత్స అందజేశారు.

 

అనంతరం అటవీ శాఖ రేంజర్ ఆర్ రాజశేఖర్, అటవీ సెక్షన్ అధికారి యేసస్వి, ఎఫ్ బి ఓ, ప్రవీణ్, ఉమామహేశ్వరరావు సమక్షంలో అంతరబ రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచిపెట్టారు.