District collector : కౌమార బాలికలు జంక్ ఫుడ్ తినవద్దు.. జిల్లా కలెక్టర్ సూచన..!
District collector : కౌమార బాలికలు జంక్ ఫుడ్ తినవద్దు.. జిల్లా కలెక్టర్ సూచన..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఆడపిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో- బేటి పడావో కార్యక్రమం కింద కౌమార బాలికలకు ఉద్దేశించి రుతుస్రావం, వ్యక్తిగత శ్రద్ధ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆడవారి ఆరోగ్యానికి రుతుక్రమం అనేది చాలా ముఖ్యమని, ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు. ఆడవారూ తీసుకునే పౌష్టికాహారం, ఆరోగ్యం పైనే రుతుస్రావం పునరుత్పత్తి ఆధారపడి ఉంటాయని, అందువల్ల దీనిని దృష్టిలో ఉంచుకుని మంచి పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు.
కౌమార బాలికలు జంక్ ఫుడ్, చిరుధాన్యాల వంటివి తినవద్దని చెప్పారు. ఆడవారు మగవారి కన్నా తక్కువ అనే భావాన్ని వదిలేయాలని ,ఆడవారు దేనిలోనూ తక్కువ కాదని ఆమె తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, సిడిపివోలు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
MOST READ :
-
Miryalaguda : వేసవిలో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..!
-
Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!
-
Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!
-
Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!










