బిగ్ బ్రేకింగ్ : నల్గొండ జిల్లాలో కూలిన డ్రోన్ విమానం

బిగ్ బ్రేకింగ్ : నల్గొండ జిల్లాలో కూలిన డ్రోన్ విమానం

శాలిగౌరారం (నల్గొండ) మనసాక్షి :

నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలో డెమో డ్రోన్ విమానం కూలింది. ఈ సంఘటన కలకలం రేపింది. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామ శివారులోని పంటపొలాలలో ఎగురుతూ వచ్చిన డెమో డ్రోన్ విమానం కూలింది . ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

విమానాన్ని బాంబు స్క్వాడ్ సిబ్బందితో కలిసి పోలీసులు పరిశీలించగా బ్యాటరీతో నడిచే ఈ విమానంలో సీసీ కెమెరాలు, జిపిఎస్ సిస్టం ఉందని తేలింది.

 

దీనిని ఎక్కడి నుంచి ఎవరు పంపారనే విషయం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ డ్రోన్ విమానం ఐదు అడుగుల పొడవు, వెడల్పుతో సుమారు 15 కిలోల బరువు ఉంది. విమానంపై 76 కోడ్ నెంబర్ కూడా ఉంది.

ఇద్దరు వ్యక్తులు రెండు కిలోమీటర్ల దూరంలోని వట్టిపాముల గ్రామంలో తాము పంపిన సర్వే విమానం తప్పిపోయిందని ఎవరికైనా కనిపించిందా అంటూ స్థానికులను ఆరా తీస్తున్నట్లు సమాచారం.