డంపింగ్ యార్డులా.. ప్రధాన రహదారి

డంపింగ్ యార్డ్ లా ప్రధాన రహదారి

చర్ల, మనసాక్షి:

చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారులను కొందరు వ్యక్తులు డంపింగ్ యార్డ్ లు గా మార్చేస్తున్నారని ఆ రహదారులపై నిత్యం ప్రయాణం కొనసాగిస్తున్న ప్రజలు ఒక్కసారిగా శనివారం బగ్గుమన్నారు.

 

చర్ల రఘు థియేటర్ వెనకాల వెంకటాపురం వేళ్ళు రహదారిపై కోడి పేగులు, చేపల పొట్టు, చాయి క్లాసులు, పాడైపోయిన ఫ్రూట్స్, తాగి పడేసిన కొబ్బరి బొండాలు, పాడైపోయిన కూరగాయలు,అరకొరగా మిగిలిపోయిన భోజనాలు, కర్రీస్, పగిలిపోయిన సీసా పెంకులు,ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వ్యర్థ పదార్థాలను తెచ్చి ఈ ప్రధాన రహదారిపై పడేస్తుంటే స్థానిక అధికారులు ఏం చేస్తూ, చూస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు.

 

కంపు కొడుతున్న ఆ రహ దారి పై ప్రయాణం కొనసాగించాలంటే బంబేలు ఎత్తిపోతున్నామని ప్రయాణికులు తెలిపారు. వ్యర్ధ పదార్ధాల వల్ల ప్రజలకు ఎటువంటి రోగాలు రావొదనే ఉద్దేశంతో ఊరికి చాలా దూరంగా డంపింగ్ యార్డ్ లను తెలంగాణ ప్రభుత్వం నిర్మించడం జరిగిందని అన్నారు. కానీ చర్ల లో ఇందుకు వ్యతిరేకంగా ప్రధాన రహదారులనూ కొందరు వ్యక్తులు డంపింగ్ యార్డ్ గా మార్చేస్తున్నపటికి స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని ప్రయాణికులు అన్నారు.

 

అడపా దడపా గా పడే వర్షాలకు ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిస్థాయిలో తడిసిపోయి ఊపిరి పీల్చలేని విధంగా భయంకరమైన కంపు కొడుతున్నాయని దీని కారణంగా రోగాల బారిన పడే అవకాశాలు మెండు గా ఉన్నాయని ఆ రహదారిపై నిత్యం ప్రయాణం కొనసాగిస్తున్న ప్రజలు గోడు వెళ్ళబుచ్చారు.

 

ఇటీవల కాలంలోనే అనేక పత్రికల్లో ఈ సమస్య వెలుగులోకి వచ్చినప్పటికీ అధికారులు ఈ సమస్యకు ఎందుకు శ్రీకారం చుట్టట్లేదని నిత్యం అ రహదారిపై ప్రయాణించే ప్రజలు అధికారులను సూటిగా ప్రశ్నించారు.

 

తక్షణమే ప్రధాన రహదారిని డంపింగ్ యార్డ్ గా మారుస్తున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ప్రజలు కోరారు.