Miryalaguda : మిర్యాలగూడలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు.. (Video)
Miryalaguda : మిర్యాలగూడలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు.. (Video)
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు మైదానంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాలకు వేలాదిమంది తరలివచ్చారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్సవాలు నిర్వహించారు.
ఉత్సవ కమిటీలో ప్రధానవక్తులుగా రామచంద్రయ్య మాట్లాడారు. ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అతిధులుగా డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, సాదినేని శ్రీనివాస్ రావు, స్కై లాబ్ నాయక్ నాయక్, ఉత్సవ కమిటీ సభ్యులు ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి, రేపాల పురుషోత్తం రెడ్డి,
గాయం ఉపేందర్ రెడ్డి, చిలుకూరి బాలు, నూకల వేణుగోపాల్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, శాగ జలంధర్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావణాసుర దహన కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బాణం వేసి నిర్వహించారు.
ఆకట్టుకున్న క్రాకర్స్ :
దసరా ఉత్సవాల సందర్భంగా ఎన్ఎస్పి క్యాంపులో క్రాకర్స్ . ఆకట్టుకున్నాయి. క్రాకర్స్ పేలినంతసేపు ఉత్సవాలకు హాజరైన వారంతా తమ సెల్ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు బంధించేందుకు ప్రయత్నించారు.
VIDEO
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో దసరా ఉత్సవాలు.. pic.twitter.com/XUjCBidNis
— Mana Sakshi (@ManaSakshiNews) October 13, 2024
LATEST UPDATE :
-
Miryalaguda : మిర్యాలగూడ ప్రజలకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ శుభవార్త.. వాడపల్లి క్షేత్రంలో ప్రతినెలా.. !
-
Thummala : తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. రైతు భరోసాపై తుమ్మల కీలక ప్రకటన..!
-
Viral Video : అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందని బైక్ ఆపాడు.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









