Dussehra Bumper Offer : దసరా పండుగ బంపర్ ఆఫర్.. రూ.100కొట్టు మేకను పట్టు, లక్కీ డ్రా..!
Dussehra Bumper Offer : దసరా పండుగ బంపర్ ఆఫర్.. రూ.100కొట్టు మేకను పట్టు, లక్కీ డ్రా..!
మన సాక్షి వెబ్ డెస్క్:
దసరా పండుగ వచ్చిందంటే పల్లెలు పట్టణాలు కిటకిటలాడుతుంటాయి. ఈ పండుగకు పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ కూడా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. పండుగ వాతావరణం పల్లెల్లో కనిపిస్తుంది. పట్టణాల్లో వ్యాపారస్తులు ఆఫర్లు ప్రకటిస్తూ వ్యాపారాలు సాగిస్తుంటారు.
దసరా పండుగ తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా బట్టల వ్యాపారస్తులే కాకుండా ఎలక్ట్రానిక్స్ , గృహప్రకారణాలు, ద్విచక్ర వాహనాలు, ఇతర వస్తువుల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. వివిధ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లలో ప్రకటిస్తారు.
కానీ విచిత్రం ఏమిటంటే గ్రామాలలో మేక, మందు, నాటుకోడి పేరుతో బంపర్ ఆఫర్లు ప్రకటించారు. లక్కీ డ్రా పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఆఫర్ గతంలో ఉన్నవో..? లేవో..? కూడా తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఆఫర్ ప్రకటిస్తూ కొంతమంది యువకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో గ్రామ ప్రజలకు దసరా ఆఫర్ అంటూ ప్రకటించారు. 100 రూపాయలు కొట్టు మేకను పట్టు. లక్కీ డ్రా ప్రకటించారు.
మొదటి బహుమతి 10 కిలోల మేక, రెండవ బహుమతి రెండు బ్లండర్ ఫ్రైడ్ ఫుల్, మూడవ బహుమతి కాటన్ బీర్లు, నాలుగవ బహుమతి 2 నాటు కోళ్లు, ఐదవ బహుమతి ఒక రాయల్ స్టాగ్ ఫుల్, కూపన్ ధర 100 రూపాయలు, డ్రా తేదీ అక్టోబర్ 10 సాయంత్రం 6 గంటలకు. అంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు వెలిశాయి.
అదే విధంగా మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని తాళ్ల సింగారంలో కూడా దసరాకు ఆఫర్ ప్రకటించారు. ఇదే విధంగా ప్రచారం జరిగింది. కాగా ప్రచారంలో యువకుల పేర్లు ఫోన్ నెంబర్లతో సహా ఇవ్వడం వల్ల వారికి పోలీసులు కూడా ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమం నిర్వహిస్తారా..? లేదా..? అనేది సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.
MOST READ:
-
CM Revanth Reddy : పేదలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. మెరుగైన వైద్యం కోసం నిర్ణయం..!
-
Miryalaguda : గాంధీ జయంతి తర్వాత ప్లాస్టిక్ కవర్స్ కనిపిస్తే తీవ్ర చర్యలు.. హెచ్చరించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్..!
-
Suryapet : ఉండ్రుగొండ గిరిదుర్గం చరిత్ర.. పర్యాటక ప్రాంతంగా చేసేందుకు కృషి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్..!
-
TG News : పేద ప్రజలకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు..!










